జ‌పాన్ నుండి ఇండియాకు వ‌చ్చిన రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌...

టాలీవుడ్ న‌టుడు రామ్‌చ‌ర‌ణ్‌కు దేశంలోనే కాకుండా విదేశాల‌లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా జ‌పాన్ నుండి కొంత‌మంది లేడిఫ్యాన్స్ రామ్‌చ‌ర‌ణ్ చూసేందుకు ఇండియాకు వ‌చ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్న రామ్‌చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రామ్ చరణ్ మీద అభిమానంతో ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ఆయ‌న లేడి అభిమానులు.

జ‌పాన్‌లో రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల సంఘం : ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్‌చ‌ర‌ణ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ్‌ని సంపాదించుకున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ కి జపాన్ అభిమానుల భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. జపాన్‌లో రామ్ చరణ్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఆ అభిమానసంఘాలు చరణ్‌తో కలిసి సంద‌డి చేసిన ఫోటోలు, వీడియోలో అప్ప‌ట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ అభిమానులు ఒక్కసారైనా త‌నను చూడాలి అంటూ ఏకంగా ఇండియాకు వ‌చ్చేసారు.

Ramcharan fans who came to India from Japan...

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ : తాజాగా జపాన్ కి చెందిన కొందరు లేడీ ఫ్యాన్స్ చరణ్ ని కలిసేందుకు హైదరాబాద్ చేరుకుని స‌రాస‌రి ఇంటికి వ‌చ్చేసారు. వారందర్ని సాధరంగా త‌న ఇంట్లోకి ఆహ్వానించాడు రామ్ చరణ్. వారు తెచ్చిన బ‌హుమ‌తుల‌ను రామ్‌చ‌ర‌ణ్‌కి అందించారు. ఇక వచ్చిన వారందరితో రామ్ చరణ్ ఫోటోలు దిగి ఎంతో స‌రద‌గా గ‌డిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు సైతం నిజమైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్' తెగ కామెంట్స్ చేసేస్తున్నారు.

ఇక చరణ్ నెక్ట్స్ సినిమా ఏంట‌ని ఎదురుచూస్తున్నామ‌ని అడిగారు జపాన్ అభిమానులు. త్వరలో మంచి సినిమాతో వస్తానంటూ రామ్ చరణ్ మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రామ్‌చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా చేయ‌నున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించ‌న‌నున్నారు. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్‌ను అందించ‌నున్నారు. అయితే ఆ సినిమాలోని మొద‌టి పాట‌ను ద‌సరా కానుకగా అఫీషియల్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+