'గేమ్‌ఛేంజర్' ఫస్ట్ రివ్యూ: శంకర్ అన్నా నీకు దండం?
రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా, అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన భారీ చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు దీన్ని నిర్మించారు. కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఈనెల 10వ తేదీన గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకోగా సినిమా బాగుందంటూ సెన్సార్ సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ కూడా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ లో 24 గంటల్లో 180 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని సంచలన రికార్డును నెలకొల్పింది.
రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు శంకర్ దీన్ని ఆపి భారతీయుడు2ను పూర్తిచేశారు. విడుదలైన తర్వాత అది అత్యంత చెత్త సినిమాగా నిలిచి నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో గేమ్ ఛేంజర్ పై ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా బాగా వచ్చిందనే అభిప్రాయం అభిమానులతోపాటు సినీ ప్రియుల్లో నెలకొంది. ట్రైలర్ పై ఎక్కడా వ్యతిరేకత రాకపోవడంతో రోజురోజుకు ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. దీనికితోడు ఇటీవలే చిరంజీవి కోసం ప్రత్యేకంగా షో ప్రదర్శించారు. దీన్ని చూసిన తర్వాత చిరు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని, ఆనందపడ్డారని తెలుస్తోంది.

చిరంజీవి చెప్పడంతో సంబరపడుతున్నారు
సంక్రాంతికి గట్టిగా కొట్టబోతున్నామని అభిమానులకు చెప్పాలంటూ ఆయన దిల్ రాజుకు సూచించారు. శంకర్ తీసిన భారతీయుడు2 సినిమా ఆడకపోవడంతోపాటు అంతకుముందు తీసిని సినిమా కూడా ఫ్లాప్ కావడంతో అందరూ శంకర్ పని అయిపోయిందనుకున్నారని, కానీ ఒక్కసారిగా జూలు విదిల్చాడని, శంకర్ తనలోని టాలెంట్ ను మారోసారి అద్భుతంగా బయటపెట్టారని చిరంజీవి కొనియాడినట్లు సమాచారం. చిరంజీవి ఈ మాట అనడంతో మెగా అభిమానులు సంతోషపడుతున్నారు. సినిమా కచ్చితంగా ఆడుతుందని, రూ.వెయ్యి కోట్లు వసూలు చేయడం ఖాయమంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాతో శంకర్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడని, ఇంటర్వెల్ కు ముందు వచ్చే 20 నిముషాల సన్నివేశాలతోపాటు సెకండాఫ్ సూపర్ గా వచ్చిందంటున్నారు. ఏదేమైనప్పటికీ జనవరి 10వ తేదీనకానీ ఈ సినిమా పరిస్థితి ఏమిటనేది తెలియదు. అప్పటివరకు వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications