'గేమ్‌ఛేంజర్‌' రివ్యూ: రామ్‌చరణ్‌, దిల్‌ రాజును నిండా ముంచేసిన శంకర్?

నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్ జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, నవీన్ చంద్ర, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: తిరు
కథ: కార్తీక్ సుబ్బరాజు
నిర్మాత: దిల్ రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.శంకర్

అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధాన్ని శంకర్ తెరకెక్కించారు. కాలం చెల్లిన కథ, కథనాలతో సినిమా తీసి భారతీయుడు2 ప్రభావం ఈ సినిమాపై ఉందనే విషయాన్ని శంకర్ నిజం చేశారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రభావం భారతీయుడు3పై పడుతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించానని, ఇప్పుడు కూడా అందివ్వాలంటే మారుతున్న ప్రేక్షకుల ఆలోచనా తీరును అర్థం చేసుకోవడంతోపాటు తాను కూడా మారాలి. ఒకప్పటి సీనియర్ దర్శకులెవరూ ఈ తరం నాడిని పట్టుకోవడం కష్టం కావడంతో సినిమాలు తీయడం మానేసి గౌరవప్రదంగా ఉన్నారు. కానీ శంకర్ మాత్రం నిర్మాతలచేత కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిస్తూ వారిని నిండా ముంచేస్తున్నాడు.

ramcharan game changer movie review

రాజమౌళి ఎందుకు అగ్ర దర్శకుడయ్యాడు?
ఇప్పటి తరం సినిమాలను వాస్తవంగా ఉంటేనే ఇష్టపడుతోంది. లేదంటే ఇంతవరకు వారు చూడని ప్రపంచాన్నైనా చూపించాలి. కానీ ఈ రెండు ఈ సినిమాలో లేవు. అసలు సినిమాలో కామెడీ ట్రాక్ ఎందుకు పెట్టారో వారికే తెలియాలి. లవ్ ట్రాక్ అనవసరం. సినిమా అన్న తర్వాత భావోద్వేగాలుండాలి. రాజమౌళి అగ్ర దర్శకుడిగా చెలామణి అవుతున్నాడంటే అందుకు కారణం ఎక్కడా తన సినిమాలో భావోద్వేగాలను వదులుకోకుండా చూసుకుంటాడు. గేమ్ ఛేంజర్ కథ బాగానే ఉన్నప్పటికీ కథనంతో పోయింది. కథను కార్తీక్ సుబ్బరాజు అందించాడు. శంకర్ తన అసిస్టెంట్ డైరెక్టర్లుగా నేటి యువతరాన్ని పెట్టుకొని వారి ఆలోచనలను పసిగట్టి సినిమాలు తీస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. లేదంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి.

ఆ నటుడు మాత్రం రెండు లుక్స్ తో ఆశ్చర్యపరిచాడు
తెలుగులో అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్న రామ్ చరణ్ నుంచి సినిమా వస్తోందంటే మంచి అంచనాలుండాలి. కానీ ఈ సినిమా విషయంలో లేవు. అలాగే రాజమౌళి సినిమా తర్వాత సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను బద్ధలు కొట్టలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడు. అయితే సినిమాలో నటన పరంగా రామ్ చరణ్ కు వంక పెట్టాల్సిన అవసరంలేదు. అప్పన్న పాత్రలో కూడా అద్భుతంగా నటించాడు. అతనికితోడు అంజలి కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఎప్పటిలాగే ఎస్ జే సూర్య విజృంభించాడు. శ్రీకాంత్ రెండు లుక్స్ తో ఆశ్చర్యపరిచాడు. బుర్రా సాయిమాధవ్ మాటలు బాగున్నాయి. అయితే కామెడీకి సంబంధించిన డైలాగ్స్ మాత్రం రాయలేకపోయాడు. పాటలకన్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ ఆకట్టుకున్నాడు.

ramcharan game changer movie review

ఆ రెండు సినిమాలే స్ఫూర్తి అన్నా.. అవి ఎప్పటివో..
రూ.15 కోట్లు ఖర్చుపెట్టి తీసిన నానా హైరానా పాటకు ఈ సినిమాలో చోటులేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుగు రోజులున్న తర్వాత ఈ పాటను కలుపుతామని చెబుతున్నారుకానీ ఎక్కడ కలుపుతారో అర్థం కాకుండా ఉంది. శంకర్ సినిమా అంటేనే రెహమాన్ సంగీతం ఉండాలి. పాటలు, సంగీతం కలిసి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాలో ఆ మ్యాజిక్ లేదు. ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు తనకు స్ఫూర్తి అని, వాటి నుంచి వచ్చినదే గేమ్ ఛేంజర్ అన్నాడు శంకర్. అవి వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రేక్షకుల ఆలోచనా సరళిని బట్టి కథలు మారాలి.. సన్నివేశాలు మారాలి.. నటీనటుల నటన కూడా మారాలి. వాటన్నింటిని రాబట్టుకోవడం దర్శకుడి బాధ్యత. అవేవీ లేకపోవడంవల్ల అన్ ప్రిడిక్టబుల్ మూవీ కాకుండా నిలిచిపోయింది గేమ్ ఛేంజర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+