డిప్రెషన్ లో ఉపాసన?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. రామ్ చరణ్ - ఉపాసన జంటకు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతో పాపులారిటీ ఉంది. అన్యోన్యంగా ఉంటూ ఒకర్నొకరు గౌరవించుకుంటూ, సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు.

ఒత్తిడికి లోనయ్యా..
వీరిద్దరికీ వివాహమైన పది సంవత్సరాలకు క్లింకార జన్మించింది. ఆ పాప పుట్టడంతో మెగా కుటుంబంలో ఆనందం అవధులు దాటింది. రామ్ చరణ్ - ఉపాసనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పింది. తన భర్తే తనకు థెరపిస్ట్ అని.. అందరిలానే తాను కూడా డెలివరీ తర్వాత ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పారు.

ramcharan wife upasana in depression

అందరికీ అలాంటి భర్త ఉండాలి
ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, తనకు అండగా చరణ్ ఉన్నాడని, తనకోసమని చరణ్ పుట్టింటికి వచ్చేశాడని, ఇలాంటి భర్త ఎవరికీ ఉండరేమో అన్నారు. చెర్రీ తనకు భర్తగా రావడం తన అదృష్టమని, తల్లిగా మారే సమయంలో భర్త మద్దతు చాలా అవసరమని, ప్రతి భార్యకు ప్రతి భర్త ఆ మద్దతివ్వాలన్నారు.

తన గురించి చరణ్ తీసుకున్న శ్రద్ధ, తన గురించి ఆలోచించే విధానం బాగా నచ్చుతుందన్నారు. ఉపాసన చెర్రీ గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందరూ చెర్రీ పనితీరుకు, భార్య గురించి ఆలోచించే విధానానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తోపాటు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను రామ్ చరణ్ చేస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్నారు. మైత్రీమూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+