ఎలాంటి అమ్మాయిని.. ఎలా మార్చావ్ వర్మా?
తనకంట్లో ఎవరైనా అమ్మాయి పడితే ఆ అమ్మాయిని రాత్రికి రాత్రే సెలబ్రిటీ చేసేస్తాడు రామ్ గోపాల్ వర్మ. అత్యంత సాదాసీదాగా ఉన్నా సరే.. వారే స్టార్ హీరోయిన్లు అవుతారు. సినిమాల్లో నటించి సెలబ్రిటీలు అవకముందే వర్మ కంట్లో పడితే అంతకన్నా ముందే సెలబ్రిటీలు అవుతారు. తనకు శారీ గర్ల్ అనే అమ్మాయి నచ్చిందని ఇటీవలే వర్మచెప్పిన విషయం తెలిసిందే. ఆ అమ్మాయి గురించి చెబుతూ తనతో ఓ సినిమా తీయాలని ఉందని కూడా చెప్పాడు. మాట ఇస్తే వర్మ నిలబెట్టుకుంటాడు.
చెప్పినట్లే ఆమెతో సినిమా తీశారు. శారీ అనే టైటిల్ తో సినిమా రూపుదిద్దుకుంటోంది. అప్పట్లో శారీ కట్టుకున్న ఫొటోలను షేర్ చేసిన వర్మ తాజాగా ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ రెండు ఫొటోలను చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. పాత ఫొటోల్లో శారీ కట్టుకొని ఎంతో అందంగా కనపడితే తాజా ఫొటోల్లో మాత్రం అందాలన్నీ ఆరబోస్తోంది.

కేరళకు చెందిన ఆరాధ్యాదేవి అనే అమ్మాయి ఫొటోలను ఆర్జీవీ డెన్ కనుగొంది. వాటిని ఒక ఇన్ స్టా రీల్ లో కనుగొన్నారు. ఆ అమ్మాయి శారీ సినిమా కోసం సంతకం చేసింది. ఫొటో గ్రాఫర్ యశ్వంత్ అద్భుతంగా షూట్ చేశాడని, ఫొటోలు చాలా బాగున్నాయంటూ వర్మ వాటిని షేర్ చేసినప్పుడు కామెంట్ చేశాడు. ఈ ఫొటోల్లో బ్లాక్ కలర్ టాప్.. జీన్స్ షార్ట్ తో ఆరాధ్య అందాల ప్రదర్శన చేస్తోంది. వాటిని చూసిన నెటిజన్లు ఎలాంటి అమ్మాయిని ఎలా మార్చేశావ్ వర్మా.. ఆ ఫొటోల్లో చీరలో ఎంతో బాగుందని, సాంప్రదాయ బద్ధంగా ఉందని, ఇప్పుడేమో దారుణంగా అందాల ప్రదర్శన చేస్తోందని, నీలాంటివారు ప్రోత్సహించబట్టే ఇలా చేసిందని, లేదంటే చీరలోనే ఎంతో చక్కగా ఉండేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. వర్మ ఇటీవలే తెలుగు రాజకీయాలను నేపథ్యంగా చేసుకొని వ్యూహం, శపథం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా వర్కింగ్ టైటిల్ తో శారీ అని పేరుపెట్టి చిత్రం చేస్తున్నాడు. దీనితర్వాత ఏ సినిమా చేయనున్నాడో చూడాలి.












Click it and Unblock the Notifications