పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. లవ్ స్టోరీ అయినా.. మాస్ యాక్షన్ అయినా రామ్ తనదైన శైలిలో తెరపై ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారు. ఇటీవల ఆంధ్రాకింగ్ తాలూకా చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు రామ్.
ఇక ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించిన రామ్, సినిమా పనులతో బిజీగా ఉన్నారు. అయితే రామ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన చర్చ మరోసారి మొదలైంది. ప్రేమ, పెళ్లి విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఆంధ్రాకింగ్ తాలుకా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రామ్ రిలేషన్ లో ఉన్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన మనసులోని భావాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రామ్.

రామ్ మాట్లాడుతూ.. "నేను చిన్నప్పటి నుండి నా లైఫ్ లో ఒంటరిగా సమయాన్ని గడిపేందుకే ఇష్టపడతాను. నాకు కూడా అందరి లాగే ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు , షికార్లకు వెళ్లడం ఇష్టమే.. కానీ ఒంటరిగా నాకు నేను కేటాయించుకునే సమయం లో వచ్చే ఆ కిక్ వేరుగా ఉంటుంది. సినీ ప్రపంచంలో ఉంటాను కాబట్టి.. నా చుట్టూ నిత్యం రద్దీ ఉండడం సహజం. కానీ అలాంటి సందర్భాల్లో కూడా నాకు నేను స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. రేపు నా జీవితం లోకి ఎవరైనా అమ్మాయి వస్తే, ఆమెతో నా సమయాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నా జీవితం లోకి ఎవ్వరూ రాకపోయినా పర్వాలేదు. ఒంటరిగానే బ్రతికేస్తా.. అంటూ చెప్పుకొచ్చారు రామ్ పోతినేని. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications