పచ్చళ్ల పాపకు బిగ్ షాక్.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ !!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీజన్ 9 ఏడో వారంలో ఎలిమినేషన్ దశకి చేరింది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, ఎలిమినేషన్లతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌కి గుడ్‌బై చెప్పారు. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత రచ్చ రచ్చగా మారిపోయింది.
ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా గేమ్ ఆడుతుంటారు. అయితే వీళ్లలో మధ్యలోనే ఎవరు బయటకొచ్చేస్తారు, ఎవరు చివరి వరకు ఉంటారనేది ఎప్పుడు సస్పెన్స్‌గానే ఉంటుంది. గతవారం అలా భరణి ఎలిమినేట్ కాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ వారం ఇప్పటికే ఆయేషా ఎలిమినేట్ అయింది. డీహైడ్రేషన్, జ్వరం లక్షణాలతో ఈమె హౌస్ నుంచి బయటకొచ్చేసింది. కానీ కొన్నిరోజుల తర్వాత తిరిగి హౌసులోకి వెళ్లే అవకాశముంది. అయితే ఆయేషా బయటకొచ్చేయడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండా ఎవరు ఊహించని కంటస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియా కోడై కూస్తుంది.

ఈ వారం నామినేషన్లలో రమ్య, సాయి శ్రీనివాస్, దివ్య, రీతూ, తనూజ, రాము, సంజన, కల్యాణ్ ఉన్నారు. తనూజ టాప్ పొజిషన్‌లో నిలవగా, తర్వాత స్థానాల్లో కళ్యాణ్, దివ్య, రీతూ, సంజన ఉన్నారు. చివరి మూడు స్థానాల్లో రాము, సాయి, రమ్య ఉన్నారు. ఓటింగ్ పరంగా రమ్యకు అత్యల్ప మద్దతు రావడంతో, ఎలిమినేషన్ నిర్ణయం తేలిపోయినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని బిగ్‌బాస్ ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
వివాదాలే మైనస్..
వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగు పెట్టింది రమ్య మోక్ష. సోషల్ మీడియాలో 'పచ్చళ్ల బిజినెస్' ద్వారా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన మొదటి రోజే టాక్ ఆఫ్ ది హౌస్ అయింది. తన వ్యవహార శైలితో వివాదాలకు తెరలేపి పర్సనల్ కామెంట్స్, అటిట్యూడ్ కారణంగా సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత ఎదుర్కొంది. ఫిజికల్ టాస్క్‌లలో మంచి పోటీ చూపించినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు, తనూజ-కల్యాణ్ రిలేషన్‌పై కామెంట్లు, ఇతర కంటెస్టెంట్లపై విమర్శలు ఆమెకు మైనస్ పాయింట్లుగా మారాయి.

మరోవైపు రమ్య మోక్ష ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది "ఆమె ఆట నిజాయితీగా లేదు" అంటుండగా, మరికొందరు "డ్రామా ఎక్కువ, కంటెంట్ తక్కువ" అని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు, అభిమానులు "బిగ్‌బాస్ హౌస్‌లో నిజంగా deserving contestants మాత్రమే ఉండాలి" అంటున్నారు.
-
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications