ధూమ్ 4 సినిమాలో విలన్‌గా పాన్ ఇండియా హీరో..ఆ నటుడు లేనట్లేనా..?
బాలీవుడ్ యాక్షన్ ఫిల్మీం 'ధూమ్' సీరిస్‌లన్నీ రికార్డుల వర్షం కురిపించాయి. ధూమ్ మొదటి చిత్రం 20 ఏళ్ల క్రితం విడుదలై రికార్డులు బద్దలుకొట్టింది. ఈ సినిమాలో విలన్లే హీరోలు. 'ధూమ్' సిరీస్ లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ విలన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 'ధూమ్ 4' సినిమాకి సంబంధించిన చర్చలు నెట్టింట వైరల్‌గా మారాయి. ధూమ్ 4లో సౌత్ ఇండియన్ స్టార్ నటుడు సూర్య విలన్ పాత్ర చేయనున్నాడని గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. అయితే, ఇప్పడు తాజాగా సూర్య స్థానంలో మరో పాన్ ఇండియా హీరో విలన్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాన్ ఇండియా హీరో ఎవరో కాదు. యానిమల్ హీరో రణబీర్ కపూర్..
ఇప్పడు ధూమ్ 4' సినిమా కోసం బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. కరోనా తర్వాత రణబీర్ కపూర్ తన స్టార్‌డమ్‌ను పెంచుకున్నారు. యానిమల్ సినిమాలతో రికార్డుల వర్షం కురింపిచారు. ఆ సినిమాలో రణబీర్ కపూర్ తన నటనతో అందరనీ మెప్పించారు. ఇప్పుడు 'ధూమ్ 4' సినిమాలో విలన్‌గా నటించేందుకు సిద్ధమయ్యినట్లు తెలుస్తోంది.

తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే తన పాత్రను అల్లుకున్నట్లుగా సమాచారం. ఇక 'ధూమ్ 4' చిత్రంలో లో రణబీర్ కపూర్ సైబర్ దొంగగా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి గత కొన్ని నెలలుగా రణబీర్, ఆదిత్య చోప్రా మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇద్దరూ సినిమా చేసేందుకు ఒప్పకున్నట్లు బీ టౌన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక, ఈ సినిమా షూటింగ్ 2025 లో మొదలుకానుందట.
పలు సినిమాలు...
బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. 'రామాయణం' సినిమాలో రణబీర్ కపూర్ రాముని పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరో చిత్రం'బ్రహ్మాస్త్ర 2' లో కూడా నటించనున్నాడు. ఆ తర్వాత అలియా భట్‌తో కలిసి సంజయ్ లీలా బన్సాలీ కొత్త సినిమాలో కూడా రణబీర్ కపూరే హీరోగా నటించనున్నాడు. ఇవన్నీ పూర్తయ్యాక 'ధూమ్ 4' ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications