ఆ హీరోతో అడ్డంగా దొరికిపోయిన రష్మిక

గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.విజయ్ దేవరకొండ - రష్మిక మొదటగా 'గీత గోవిందం'లో కనిపించారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.ఆ తర్వాత ఈ జంట 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా కనిపించి మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా జోడి నిలవడంతో విజయ్ దేవరకొండ - రష్మికలపై అనేక పుకార్లు షికార్లు చేశాయి.

ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయానికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.

Rashmika and Vijay Deverakonda went to a restaurant together

ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు.

మరోసారి ఈ జంట ఒకే చోట దర్శనం ఇచ్చారు. రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ జంట మరోసారి కలిసి దర్శనం ఇచ్చారు.

ముంబైలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి కనిపించారు. ఈ ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి ఓ హోటల్‌కు వెళ్లారు. మొదట రష్మిక రెస్టారెంట్‌లోకి వెళ్లగా, కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ మాస్క్, టోపీ ధరించి ఎవరికీ కనిపించకుండా రెస్టారెంట్ వెనుకవైపు నుంచి వచ్చాడు.ఇది గమనించిన ఫొటోగ్రాఫర్లు వీరి ఫొటోలను తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె అభ్యర్థన మేరకు కాసేపు మాస్క్ తీసి ఫోజులిచ్చింది. వారు ఫోటోలు తీస్తూనే ఉన్నా ఆమె పట్టించుకోకుండా రెస్టారెంట్‌లోకి వెళ్లిపోయింది. ఇలా వీరిద్దరు మరోసారి ఇలా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీరి బంధంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+