కమిట్‌మెంట్ ఇచ్చిన తర్వాతే స్టార్ హీరోయిన్ అయ్యా: రష్మిక
దక్షిణ భారతదేశం నుంచి హీరోయిన్ గా ఉంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు రష్మిక. అంతేకాదు.. నేషనల్ క్రష్ అయ్యారు. రష్మిక మందన్నా ఏదైనా సినిమా ఒప్పుకుందా? అంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అనే పేరు సంపాదించుకుంది. నాగశౌర్య సరసన చలో సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రష్మిక మంచి మంచి కథలను ఎంచుకుంటూ జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్నారు. తన అందం, నటనతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది.
తనకు తానే ప్రామిస్
ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనకు తానే కమిట్మెంట్ తీసుకొని ప్రామిస్ చేసుకొని హీరోయిన్ గా మారింది అనేది ఆ వార్త సారాంశం. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. అందరు అమ్మాయిల్లానే తనకు కూడా 25 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకొని పిల్లల్ని కని జీవితంలో స్థిరపడాలని అనుకుందంట. భర్త, పిల్లలతో సరదాగా జీవితాన్ని ఆస్వాదించానుకుందంట.

ఆర్థికంగా స్థిరపడాలని..
అయితే కుటుంబం ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి.. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు అని తనకు తానే ఒక ప్రామిస్ చేసుకుందంట. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికీ డబ్బులకు సంబంధించిన విషయంలో ఎంతో కఠినంగా ఉంటుంది. ఖర్చు చేసే విషయంలో ఆచితూచి చేస్తుంది. దుబారా ఖర్చులు చేయదు. అంతేకాదు.. విజయ్ దేవరకొండతో ఉన్న ప్రేమాయణాన్ని బయట పెట్టకుండా ఉండటానికి ఇది కూడా ఒక కారణమేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications