రష్మిక- విజయ్ దేవరకొండ మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు..!
టాలీవుడ్ రొమాంటిక్ పెయిర్స్ లో రష్మిక- విజయ్ దేవరకొండ జంట ముందుంటుంది. తెరపై వీరి కెమిస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. 2018లో విజయ్, రష్మిక కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంతో విజయ్- రష్మిక రొమాంటిక్ జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై వీళ్ల కెమిస్ట్రీకి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఇద్దరికీ వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో ఇద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' చిత్రం చేశారు. ఆ తర్వాత వీళ్ల మధ్య బంధం మరింత దృఢంగా మారింది.
అయితే చాలాసార్లు ఇద్దరూ అనేక చోట్ల కెమెరా కంటికి చిక్కారు. విజయ్- రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. విజయ్- రష్మికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తతో అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
ఇక విజయ్- రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో అని సామాజిక మాధ్యమాల్లో తెగ వెతికేస్తున్నారు నెటిజెన్లు. అయితే రష్మిక మందాన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో జన్మించింది. 2025లో ఆమె వయసు 29 సంవత్సరాలుగా ఉంది. ఇక విజయ్ దేవరకొండ వయసు విషయానికి వస్తే 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలుగా ఉంది. అంటే, రష్మిక- విజయ్ మధ్య ప్రస్తుతం వయసు తేడా 7 సంవత్సరాలు అని స్పష్టం అవుతోంది.

ఇటీవల కింగ్డమ్ మూవీతో అలరించిన విజయ్ దేవరకొండ.. త్వరలో రాహుల్ సంకీర్తన్ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో విజయ్ రాయలసీమలోని ఓ గ్రామీణ నేపథ్యంలో కనిపించనున్నాడని సమాచారం అందుతోంది. ఇక రష్మిక ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications