నిశ్చితార్థం ఒకరితో..ఎఫైర్ మరొకరితో..పెళ్లి ఎవరితోనో..? తెలుగు స్టార్ హీరోయిన్ సంచలనం

ఓ తెలుగు స్టార్ హీరోయిన్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఓ హీరోతో నిశ్చితార్థం చేసుకున్న ఆ హీరోయిన్, తర్వాత అతనికి గుడ్ బై చెప్పి మరో హీరోతో రిలేషన్‌లో ఉంది. మరి అతన్ని అయినా పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు రష్మిక మందన్న.తెలుగులో స్టార్ హీరోయిన్ అంటే ప్రస్తుతానికి రష్మిక మందన్న ముందున్నారని చెప్పాలి. ఎందుకంటే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారామె. 'పుష్ప' సినిమాతో రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాతో ఈ అమ్మడు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. 'యానిమల్' సినిమాలో బోల్డ్‌గా నటించింది. రణ్‌బీర్ సింగ్‌తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది.

ఇక 'పుష్ఫ-2' సినిమాతో మరోమారు మాయ చేయడానికి ఈ బ్యూటీ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడులో జరిగిన 'పుష్ఫ-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మికను యాంకర్ ప్రశ్నిస్తూ.. తన పెళ్లి, ప్రేమ గురించి ప్రశ్నించారు. దీంతో నా ప్రేమ గురించి అందరికి తెలుసునంటూ వేదికపైనే నవ్వుతూ చెప్పడం జరిగింది. అయితే రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

Rashmika Mandanna broke up with her fianc Rakshit Shetty and is in a relationship with Vijay Deverakonda

ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇస్తున్నారు. ఇటీవలే ఓ రెస్టారెంట్‌లో కలిసి వీరిద్దరు కనిపించారు. దీంతో ఈ జంట డేటింగ్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే గతంలో రష్మిక కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. విజయ్ దేవరకొండ కారణంగానే రక్షిత్ శెట్టికి రష్మిక బ్రేకప్ చెప్పిందనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రష్మిక గాఢమైన ప్రేమలో మునిగిపోయిందని తెలుస్తోంది.వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. మరి దీనిపై విజయ్ దేవరకొండ, రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+