రష్మిక వీడియోపై బయటపడ్డ అసలు దొంగ.. మొత్తం ఆమె చేసిందా..?
హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. రష్మిక ఫేస్‌ను మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌తో లిఫ్ట్‌లో వెళుతున్నట్టు రష్మికను ఆ వీడియోలో కనిపించింది.
Thank you for spreading the message 🙏 https://t.co/JbnDwz7ZfL
— Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023
మొదట అందరూ ఈ వీడియోలో ఉంది హీరోయిన్ రష్మికనే అనుకున్నారు. కాని ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే కాని అసలు విషయం బయటపడలేదు. రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఈ వీడియోలో ఉన్న అసలు వ్యక్తి వివరాలు బయటకు వచ్చాయి. అసలు వీడియోలో ఉన్న ఆమె పేరు జారా పటేల్‌గా గుర్తించారు. ఆంగ్లో ఇండియన్ అయిన జారా పటేల్ ప్రముఖ కంపెనీలో డేటా ఇంజనీర్‌గా పని చేస్తుంది. జారా పటేల్ రెండు ఇన్సాస్టాగ్రామ్ అకౌంట్స్‌ను మెయిన్‌టైయిన్ చేస్తుండగా.. అందులో ఒక అకౌంట్‌లో ఫాలోవర్స్ కోసం జారా పటేల్ అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తుంటుందని తెలుస్తుంది.

ఆ ఇన్సాస్టాగ్రామ్ అకౌంట్‌లో తన ప్రైవేట్ ఫొటోస్, వీడియోలను పోస్ట్ చేస్తూ జారా పటేల్ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో 4లక్షలకు పైగా ఫాలో అవుతున్నారంటే జారా పటేల్ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే అక్టోబర్ 9న జారా పటేల్ తన ఇన్సాస్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోకే రష్మిక ఫేస్‌ను పెట్టి మార్ఫింగ్ చేశారు.
🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
— Abhishek (@AbhishekSay) November 5, 2023
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
ఈ వీడియోపై ఓ న్యాయవాది స్పందిస్తూ.. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రష్మికపై చేసిన ఆశ్లీల వీడియో గురించి సినీ , రాజకీయ ప్రముఖులు స్పందించారు. బిగ్ బి అమితాబ్, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య మొదలగు వారు ఈ ఘటన గురించి స్పందించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతూ.. రష్మికకు అండగా నిలిచారు.
ఇక తన ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియోపై హీరోయిన్ రష్మిక కూడా స్పందించారు. ఈ వీడియో తనను చాలా భాదించిందని రష్మిక చెప్పుకువచ్చింది. తన ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని... ఇది నాకు ఏమాత్రం భయం కలిగించదని రష్మిక చెప్పుకొచ్చింది. ఒక మహిళగా, నటిగా.. నాకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ రష్మిక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications