రతన్ టాటా‌ను దారుణంగా మోసం చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇండియా దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఆయన మరణంపట్ల యావత్ భారతావని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు దేశానికి తీర్చలేనిదంటూ కన్నీరు పెట్టింది. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారాయన. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో పరోపకార కార్యక్రమాలను చేపట్టారు. టాటా ట్రస్ట్స్ ద్వారా లక్షలాది మందికి సహాయం చేశారు.భారతదేశ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ అనే అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది.

తన జీవితంలో ఎంతోమందికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్ టాటా వైవాహిక జీవితానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన యువకుడుగా ఉన్న సమయంలో ఓ హీరోయిన్ రతన్ టాటాను దారుణంగా మోసం చేసిందట. బాలీవుడ్ నటి సిమి గరేవాల్‌, రతన్ టాటా ఇద్దరు ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు వెలిశాయి. వీరిద్దరు కొంతకాలం డేటింగ్ చేసినప్పటికీ, దాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లలేకపోయారు. సిమి గరేవాల్‌ రతన్ టాటాతో పాటు మరో ఇద్దరితో ప్రేమయాణం సాగించిందని తెలుస్తోంది. సిమి గరేవాల్‌ ప్రేమయాణం సాగించిన వారిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తండ్రి కూడా ఉండటం విశేషం. దీంతో సిమి గరేవాల్‌‌తో రిలేషన్‌షిప్‌కు రతన్ టాటా బ్రేకప్ చెప్పేశారని తెలుస్తోంది.

Ratan Tata ex girlfriend Simi Garewal

రతన్ టాటాతో పాటు మరో ఇద్దరితో ప్రేమయాణం నడిపిన, సిమి గరేవాల్‌ వీరందరర్ని కాదని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే సిమి గరేవాల్‌‌ అవకాశం చిక్కినప్పుడల్లా రతన్ టాటాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటుంది. రతన్ టాటాతో తన రిలేషన్‌‌పై సిమి అగర్వాల్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. రతన్ టాటా పర్ఫెక్ట్ జెంటిల్‌మెన్. ఆయన సంపూర్ణుడు. ఆయనలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. డబ్బు కోసం ఆయన ఏనాడూ పనిచేయలేదు. విదేశాల్లో ఉన్నంత ప్రశాంతంగా రతన్ టాటా ఇండియాలో లేరని ఆమె చెప్పుకొచ్చింది. మా మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండేవి. పెళ్లయినంత మాత్రాన మహిళలు ఉద్యోగం మానేయాలనేమీ లేదని రతన్ చెప్పేవారని.. ఆ తర్వాత మా మధ్య ప్రేమ తగ్గిపోయింది. అందుకే పెళ్లి చేసుకోలేదని సిమి అగర్వాల్ చెప్పుకొచ్చింది.ఈ విధంగా రతన్ టాటా పెళ్లికి దూరంగా ఉండటానికి బాలీవుడ్ నటి సిమి గరేవాల్‌ కూడా ఒక భాగమనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+