పాన్ ఇండియా మూవీలో బిగ్ బాస్ బ్యూటీ.. రాహుల్ మాజీ గర్ల్ ఫ్రెండ్ !
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకుంది " రతిక రవీంద్ర". షో కి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చిన రతిక.. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. తన అందం, ఆటతీరుతో ఆడియన్స్ ని ఫూ ఫిదా చేసేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన లుక్స్, లైఫ్‌స్టైల్ అప్‌డేట్స్‌తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాగా 'పిజ్జా', 'సూదు కవ్వుమ్', 'అట్టకత్తి', 'శరభం', 'ఇరుది సుట్రు', 'మాయవన్' వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు సి.వి. కుమార్. ఈసారి మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'ఎక్స్ వై (XY)' పేరుతో రాబోతున్న ఈ మూవీలో రతిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపుతోంది.

మిస్టీరియస్ & సైంటిఫిక్ ఎలిమెంట్స్..
తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చూస్తుంటే రొటీన్ సినిమా కాదని తెలుస్తోంది. పోస్టర్‌లో టీ కప్పు, కెమెరా, మానవ మెదడు, డీఎన్ఏ నిర్మాణం, రాక్షస రూపం, ఆ తరువాత హీరోయిన్ లుక్.. అలాగే గర్భంలో ఉన్న శిశువుల దృశ్యాలు చూపించడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది.
కథ ఏంటి, నేపథ్యం ఏమిటి అనే అంశాలను రివీల్ చేయకుండా.. కేవలం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ పోస్టర్ రూపొందించినట్టు భావిస్తున్నారు. దాంతో మరోసారి డైరెక్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
రతిక రవీంద్ర.. ఈ సినిమాలో పాత్ర బలమైన భావోద్వేగంతో కూడిన, సైకాలజికల్ డెప్త్ ఉన్న రోల్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. సౌత్‌లోని ప్రేక్షకులందరికీ సైంటిఫిక్ థ్రిల్లర్‌లపై మంచి ఆసక్తి ఉండటంతో, ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటీటీ రిలీజ్ గురించిన చర్చలు కూడా మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications