యాంకర్ సుమపై రవితేజ సీరియస్(వీడియో)
యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె అంత బాగా మరే ఇతర తెలుగు యాంకర్ షోస్ చేయలేదు అన్నట్టుగా ఆమె తనదైన మార్క్ సృష్టించుకుంది. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవ్వడితో అందరినీ మైమరిపిస్తుంది.
స్పాంటేనియస్ గా పంచులు వేయడమే కాదు.. ఎదుటి వాళ్ల పంచ్‌లకు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకరమ్మ స్టైల్. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ, నవ్విస్తూనే ఉంటారు సుమ.కేరళ అమ్మాయి అయినప్పటికి, తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చేసేది ఏ షో అయినా, అక్కడున్నది స్టార్ హీరోనైనా అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేయడంలో సుమ సిద్ధహస్తురాలు.

ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలందరికి కూడా బెస్ట్ యాంకర్‌గా సుమ నిలిచిపోయారంటే ...ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యంగ్ హీరోలు సైతం సుమను అభిమానిస్తుంటారు.ఆ మధ్య మీడియా వాళ్ల గురించి సరాదాగా మాట్లాడింది కూడా సీరియస్ కావడంతో వెంటనే క్షమాపణలు చెప్పిన గొప్ప గుణం ఆమె సొంతం.

అలాంటి సుమపై మాస్ రాజా రవితేజ సీరియల్ అయ్యారు. ఈ ఘటన మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో చోటు చేసుకుంది. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈక్రమంలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేలను యాంకర్ సుమ ప్రత్యేకంగా ఇంటర్య్వూ చేశారు. ఈ సమయంలో రవితేజ యాంకర్ సుమపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు రవితేజ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వడంతో ఇదేంటని ఆమె ప్రశ్నించారు. దీనిపై రవితేజ మాట్లాడుతూ.. అంటే ఇప్పుడు కథ అంతా చెప్పేయాలా ఏంటి అంటూ సెటైర్ వేస్తాడు. ఇదింతా కూడా సరాదాగానే జరిగింది. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ సైతం రియాక్ట్ అయ్యారు. యాంకర్ సుమ మీద సీరియస్ అయిన రవితేజ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications