విక్రమార్కుడు నుంచి ఇరుముడి వరకు.. రవితేజకు కలిసొస్తున్న లక్కీ సెంటిమెంట్!
మాస్ మహారాజా రవితేజ చిత్రాల్లో మాస్, యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన సెంటిమెంట్ కథాంశాలతో రవితేజకు ఓ ప్రత్యేకమైన, బలమైన సెంటిమెంట్ ఉంది. తాజాగా వచ్చిన 'ఇరుముడి' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
గతంలో మాస్ మహారాజా రవితేజ కెరీర్లోని సూపర్ హిట్ సినిమాలను గమనిస్తే.. చిన్నారుల సెంటిమెంట్ కథాంశంలో అంతర్భాగంగా ఉన్న ప్రతీసారి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది. గతంలో విక్రమార్కుడు, కిక్, క్రాక్ వంటి చిత్రాలలో చిన్నారులు కథలో కీలక పాత్ర పోషించగా.. ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు ఇరుముడి కూడా అలాంటి భావోద్వేగభరితమైన కథాంశంతో రాగా, ఇప్పటివరకు దీనికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు 'ఇరుముడి' సినిమాలో కూడా తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథతో వచ్చి రవితేజ మళ్లీ ఆ లక్కీ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు.

ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలను అతిగా చేయకుండా సునాయాసంగా పండించగల సత్తా రవి తేజకు ఎప్పుడూ ఉంది. పిల్లలతో ఆయనకున్న ఆ అనుబంధం 'ఇరుముడి'లో మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా అదే ఈ సినిమాకు అతిపెద్ద బలంగా మారవచ్చు. రవితేజ, చిన్నారుల సెంటిమెంట్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ విఫలం కాలేదనేది మరోసారి నిరూపితమైంది. తొలిరోజే పాజిటివ్ టాక్ తో పాటు భారీ వసూళ్లను సాధించిన 'ఇరుముడి'.. ఇప్పటికే మంచి ఆరంభాన్ని అందుకోవడంతో, ఈ పాత సెంటిమెంట్ మళ్లీ దృష్టిని ఆకర్షిస్తోంది













Click it and Unblock the Notifications