రవితేజ 'ఈగల్' టీజర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులంతా ఉత్సాహాన్ని పొందుతారు. వయసు పెరిగేకొద్దీ చురుగ్గా నటిస్తున్న రవితేజ తన నటనలోని కొత్త కోణాలను కూడా పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా టైగర్ నాగేశ్వరావు విడుదలైన సంగతి తెలిసిందే. అనుకున్న స్థాయిలో ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావించారు.
సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13వ తేదీన మరో సినిమాను విడుదల చేయనున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్యథాపర్ కథానాయికలుగా నటించిన ఈగల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీని నిర్వహించే కార్తీక్ కు ఇది దర్శకుడిగా మొదటి సినిమా. మధుబాల, నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. అలా ఎలా ఉందో తెలుసుకుందాం.

టీజర్ మొదట ఎక్కడ ఉంటాడు? అని అడిగితే అడవిలో ఉంటాడు.. నీడై ఉంటాడు.. కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడు.. అని అనుపమ పరమేశ్వరన్ కి ఒక ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. రవితేజ కళ్ళను చూపిస్తారు. ఇది విధ్వంసం మాత్రమేనని, తర్వాత రాబోయేది విశ్వరూపమని నవదీప్ చెప్పిన డైలాగు రవితేజ గురించి అని అర్థమవుతుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రజలకు కట్టు కథ, ప్రభుత్వాలు కప్పెట్టిన కథ అనే డైలాగ్స్ వస్తాయి. రవితేజ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన ఒక సంఘటనలో ప్రభుత్వాలు సైతం ఇన్వాల్వ్ అయ్యి, దాన్ని కప్పెట్టినట్టు అర్థమవుతుంది.
మాస్ మహారాజా లుంగీ కడితే ఎంత మాస్ గా ఉంటాడో చూపించారు. హెయిర్ స్టైల్, ముఖం మీద గాటు, గన్స్ పట్టుకొని లుంగీ ఎత్తికట్టి ఫైట్ చేసే విధానాన్ని బాగా తీశారు. ఇంగ్లిష్ హీరో హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలా చూపించారు. అభిమానులు ఇష్టపడే విధంగా టీజర్ ను రూపొందించారు. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని దర్శకుడు కల్పించాడు.












Click it and Unblock the Notifications