'కల్కి' వసూళ్లన్నీ అబద్దాలే?
వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన 'కల్కి' చిత్రం సంచలన కలెక్షన్లు రాబడుతూ విజయపథంలో దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుతానికి ఈ సినిమా రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం కూడా 'కల్కి'లో భాగమైంది. పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ముడిపెడుతూ దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.
అనుకున్న స్థాయిలో రావడంలేదా?
వాస్తవానికి ఈరోజుల్లో ఏ చిత్ర నిర్మాతైనా తమ సినిమాల ఒరిజినల్ కలెక్షన్లను వెల్లడిస్తున్నారా? లేదంటే ఫేక్ కలెక్షన్లు చెబుతున్నారా? అంటూ అగ్ర కథానాయకుడి సినిమా విడుదలైన ప్రతిసారీ ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతుంటుంది. తాజాగా 'కల్కి' సినిమాకు సంబంధించి కూడా ఇటువంటి చర్చే జరుగుతుండటం గమనార్హం.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డుల దిశగా సాగుతుందని డార్లింగ్ అభిమానులు అంచనాలు వేసుకోగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది. 'కల్కి' సినిమా కలెక్షన్లకు సంబంధించి లోగుట్టుగా ఏం జరుగుతోంది? అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడంలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. విడుదలైన మొదటిరోజుతో పోలిస్తే 11వ రోజుకు వచ్చేసరికి బాగా తగ్గాయి. వసూళ్లు తగ్గడం అనేది సహజమే అయినప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది?
బయటకు చెప్పని నిర్మాణ సంస్థ
కలెక్షన్లు ఇలాగే వస్తే రూ.1500 కోట్లు, రూ.2వేల కోట్లు రాబట్టడం కష్టమని అర్థమవుతోంది. దీంతో 'కల్కి' నిర్మాతలు చాకచక్యంగా వ్యవహరించి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించారు. 'కల్కి' సినిమాకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలతో ఇది జరిగింది. దీంతో ఇది చూసిన సినీ ప్రియుల్లో సహజంగానే కల్కిపై ఆసక్తి కలుగుతోంది.
శని, ఆదివారాల్లో మళ్లీ కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. సోమవారంరోజు సినిమా కలెక్షన్లు డల్ అవకూడదనే ఉద్దేశంతో నిర్మాతలున్నాయి. రూ.1500 కోట్లు సాధించడానికి ఇంకా రూ.700 కోట్ల దూరంలో 'కల్కి' ఉంది. అంత బడ్జెట్ ను అందుకోవడం అసాధ్యమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాణ సంస్థ మాత్రం ఏ విషయాన్ని బయటకు చెప్పడంలేదు.












Click it and Unblock the Notifications