సమంత, నాగ చైతన్య కాపురంలో చిచ్చు పెట్టింది అతడే..!
హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.
సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూ ఆగస్టు 8న అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. గతేడాది చివర్లో వీరి వివాహం కూడా సింపుల్‌గానే జరిగింది. అటు సమంత మాత్రం సింగిల్‌గానే జీవనాన్ని సాగిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు సమంత, విడాకులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సినిమాల కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కొన్నిసార్లు, ఓ పొలిటికల్ లీడర్ వల్ల సమంత, నాగ చైతన్య మధ్య గొడవలు జరిగాయని మరికొన్నిసార్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాస్తవానికి ఇవేమి కూడా కారణాలు కాదని తెలుస్తోంది. ఓ దర్శకుడు వల్లే సమంత , నాగ చైతన్య విడిపోయారని ప్రచారం జరిగింది.

ఆ వ్యక్తి మరెవరో కాదు..బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు.సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నటించడం.. అందులో బోల్డ్‌గా కనిపించడం చైతూకు నచ్చలేదని టాక్ అప్పట్లో బాగా వినిపించింది. ఈ వెబ్ సిరీస్ కారణంగానే సమంత , నాగ చైతన్యలు విడిపోయారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఫ్యామిలీ మెన్'' వెబ్ సిరీస్ తనకు చాలా చెడ్డ పేరు తీసుకువచ్చిందని.. దీని కారణంగానే తాను తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నట్టు సమంత ఓ సందర్భంలో పేర్కొంది. ఆ సినిమాలో తన నటన వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించాలని కోరింది. ఆ వెబ్ సిరీస్‌లో నటించినందుకు సమంత క్షమాపణలు కోరడం సంచలనం సృష్టించింది.
ఇక ఈ వెబ్ సిరీస్ సమయంలోనే రాజ్ నిడిమోరుతో సమంత చాలా సన్నిహితం ఏర్పడిందని తెలుస్తోంది. చైతుతో విడాకుల తర్వాత వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో రాజు నిడుమోరు ఫొటోలనే సమంత షేర్ చేస్తోంది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని నెటజన్లు అభిప్రాయపడుతున్నారు.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..!












Click it and Unblock the Notifications