పవన్‌తో విడాకుల కంటే ఆ విషయమే ఎక్కువగా బాధపెట్టింది : రేణు దేశాయ్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్‌ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

రేణు దేశాయ్‌ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇటీవల కాలంలో రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు.

renu desai emotional words on her father and mother

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులకు సైతం ఆమె గట్టిగానే కౌంటరిస్తున్నారు. తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. వారి టార్చర్ తట్టుకోలేక ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను డిలీట్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. పేద పిల్లల చదువు,ఆరోగ్యం, మూగ జీవాలు కోసం సోషల్ మీడియాలో ఆమె ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకూ తోచినంత సాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తమ తల్లిదండ్రులు ముందుగా మగ పిల్లవాడే జన్మిస్తాడని నమ్మకంతో ఉన్నారట. కానీ తాను పుట్టడంతో తమ పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. నా తండ్రి నన్ను చూడటానికి , నన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టపలేదని చెప్పి ఆమె బాధపడింది. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారని, కానీ తమ పేరెంట్స్ స్టడీ పర్సన్స్ కాబట్టి తనను చంపలేదని రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.

తల్లి ఉండి కూడా ఆమె ప్రేమను పొందకపోవడం పెద్ద నరకమని ఆమె అభివర్ణించింది. మా ఇంట్లో పనిమనిషే తనను ప్రేమగా చూసుకున్నారని చెప్పి రేణు దేశాయ్ బాధపడింది. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకోవడం కంటే పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. నాలాంటి జీవితం పిల్లలకు రావొద్దనే ఉద్దేశంతోనే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+