Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదు!

ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. కేవలం ప్రచారం కోసం, ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీలను బూతులు తిట్టడం ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తుందో రేణు దేశాయ్ తన తాజా చర్యల ద్వారా నిరూపించారు. తనపై అసభ్య పదజాలంతా విమర్శలు చేసిన వారిపై రేణు దేశాయ్ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఆరుగురికి పైగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫేమ్ కోసం ఇంత దారుణమా?
ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన నటి రేణు దేశాయ్.. నిందితులను విచారించినప్పుడు తెలిసిన విషయాలు తనను విస్మయానికి గురిచేశాయని పేర్కొన్నారు. "ఎందుకు ఇలా దూషిస్తున్నారు" అని పోలీసులు ప్రశ్నించగా.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై తప్పుడు కామెంట్స్ రాస్తే ఫేమ్ వస్తుందని.. ఫాలోయింగ్ పెరుగుతుందని భావించి ఇలా చేశామని నిందితులు సమాధానం ఇచ్చారట. కేవలం సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంతటి అనాగరికమో రేణు దేశాయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Renu Desai Files Cyber Complaint 6 Trollers Arrested for Abusive Comments on Social Media

రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రోలింగ్‌కు పాల్పడే వారికి రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. "మీరు చేసే బూతు కామెంట్స్ కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కావు. పోలీసు కేసు నమోదైతే మీ కెరీర్, మీ కుటుంబం, సమాజంలో మీ గౌరవం అన్నీ దెబ్బతింటాయి. మీ భావ ప్రకటన స్వేచ్ఛను మర్యాదపూర్వక విమర్శలకే పరిమితం చేయండి, దూషణలకు కాదు" అని ఆమె హితవు పలికారు. అవసరమైతే సదరు వ్యక్తులు పనిచేస్తున్న సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తానని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.

చర్యలు మాత్రం ఆగవు..
ఇకపై అరెస్టయ్యే వ్యక్తుల వివరాలను బహిరంగంగా వెల్లడించకూడదని నిర్ణయించుకున్నప్పటికీ.. చర్యలు మాత్రం ఆగవని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు. అజ్ఞాతంగా ఉండి ఎవరినైనా దూషించవచ్చని భావిస్తే అది పొరపాటని, టెక్నాలజీ సాయంతో పోలీసులు ఎవరినైనా పట్టుకోగలరని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ చర్యల వల్ల వ్యవస్థపై తనకు నమ్మకం పెరిగిందని రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+