రేణు దేశాయ్‌కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేధింపులు

పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తర్వాత రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్‌ విడుదల చేశారు.

అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను వేధించారు. ఈ విషయంలో రేణు దేశాయ్ సైతం పవన్ అభిమానులకు కౌంటరిచ్చారు. మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ అభిమానులను ప్రశ్నించారు.పవన్‌ను ఉద్దేశించి పరొక్షంగా ఆయన ఒక అమ్మాయితో బేబీని కన్నారు.

Renu Desai harassed by Pawan Kalyan s fans

ఈ మాటలు నేను చెప్పడానికి చాలాఈజీగా అనిపించినప్పటికీ.. నిజ జీవితంలో ఇది చాలా కష్టంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి.మీ భర్తగా ఆయన ఉండి ..ఇలా మీతో చేస్తే మీకు ఏమనిస్తుందని రేణు దేశాయ్‌ అభిమానులను ప్రశ్నించారు. 11 ఏళ్ల కాపురం తరువాత వేరే మహిళతో ఓ బిడ్డను కంటే మీకు ఓకేనా . అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందని పవన్ కల్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ కౌంటరిచ్చారు. తాజాగా మరోసారి పవన్ ఫ్యాన్స్ నుంచి ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి.

పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా ఓ అభిమాని రేణు దేశాయ్‌ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టగా.. ఆ అభిమానికి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సుధాకర్ అనే పవన్ అభిమాని రేణూ దేశాయ్‌ని ట్యాగ్ చేస్తూ.. వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది.

ఏది ఏమైనా విధి ప్రతీదీ నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన.. మిమ్మల్ని మిస్ అవుతున్నాము అంటూ రేణు దేశాయ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌కు రేణూ దేశాయ్ రిప్లై ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సుధాకర్ గారు మీకు కొంచెం అయిన బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్‌ను నేను వదియలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రేణూ దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+