అరెస్ట్ అవుతావ్ జాగ్రత్త..రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్
పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. ఇటీవల రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలు పవన్ కల్యాణ్‌తో ఎక్కువగా కనిపిస్తున్నారు.ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో రేణు దేశాయ్ కొడుకు, కూతురు పవన్ కల్యాణ్‌తో దర్శనం ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్‌ను నేను వదిలేయలేదని..ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇక తన కొడుకు అకీరాపై పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు.

అకిరాను PSPK2 అంటూ.. పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ట్విట్టర్ నుంచి వైదొలిగారు. పేద పిల్లల చదువు,ఆరోగ్యం, మూగ జీవాలు కోసం సోషల్ మీడియాలో ఆమె ఫండింగ్ కలెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు.

ఓ యువకుడు కుక్కను గిరగిరా తిప్పి అవతల పడేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. తాజాగా ఈ వీడియోపై రేణు దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోను షేర్ చేస్తూ...అతని అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాలంటూ పోస్ట్ షేర్ చేసింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె ఈ విధంగా స్పందించారు..''ఇప్పుడు కఠిన నియమాలు, సెక్షన్లు వచ్చాయి. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే అరెస్ట్ అవుతారు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పనులు చేయకండి. పోలీసులు మమ్మల్ని సమాచారం కూడా అడగకుండా అతని క్రూరత్వం చూసి అరెస్ట్ చేశారు. పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications