నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి .. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్ (వీడియో)

రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస పోస్టులు పెడుతూ వస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. రేణు దేశాయ్‌ గతంతో పోలిస్తే ఇటీవల మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పవన్ అభిమానులు రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని మేసేజ్‌లు చేస్తున్నారు.

వారికి తనదైన రీతిలో ఆమె కౌంటరిస్తూనే ఉన్నారు. పవన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని ఆయన అభిమానులు కామెంట్స్ చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ పవన్ నన్ను వదిలేశారు కానీ..నేను కాదంటూ అభిమానులకు గట్టి కౌంటరిచ్చారు. ఇక కొడుకు అకిరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు.

renu desai shocking video on pawan kalyan

అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకిరాకు కాని.ఆయన తండ్రి పవన్ కల్యాణ్‌కు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు.మీ ఫీలింగ్స్‌ను ఆకిరా మీద బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియోలో తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు.. ''నా ఐఫోన్‌లో భోగి మంట ఈ స్లో మోషన్‌ను చిత్రీకరించాను. డిసెంబర్ నుండి దానిపై ట్రిప్ చేస్తున్నాను. నేను ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయలేదని మర్చిపోయాను. నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి లేదా నేను ఇప్పటికీ అతనిని కోల్పోతున్నానని మీరు భావించినందున నేను ఈ పోస్ట్ ఎలా ఉంచాను అనే దానిపై ఏవైనా అవాంఛనీయ సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను లేదా బ్లాక్ చేస్తాను'' అంటూ రాసుకొచ్చింది. రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+