ఇండియాలో అత్యంత ధనవంతుడైన హీరో అతనే..!
ఈ రోజుల్లో సినిమాలంటేనే అత్యంత ఖరీదుతో కూడుకున్నదనే చెప్పాలి. గతంలో సినిమాలు ఓ రాష్ట్రానికో లేదా ఒక భాషకో పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.భాషతో ఏమాత్రం సంబంధం లేకుండా బౌండరీలు దాటి వెళ్లడంతో, సినిమా పరిధి కూడా పెరిగింది. దాంతో సినిమా ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. సినిమా బడ్జెట్‌లో నటీ, నటుల పారితోషకాలకే మెజార్టీ ఖర్చవుతోంది. ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్ బడ్జెట్‌లో సగం ఉంటుంది. ఇక లెక్కన చూసుకుంటే హీరోల సంపాదన బాగుంటుంది.
ఓసారి దేశంలో ఏ హీరో అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారో ఓసారి పరిశీలిస్తే... కేజిఎఫ్ చాప్టర్ 1, కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన రాకింగ్ స్టార్ యష్ నికర ఆస్తుల విలువ రూ.1,578 కోట్లని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నికర ఆస్తుల విలువ రూ.1,842 కోట్లని లెక్కలు చెబుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నికర ఆస్తుల విలువ రూ.1,866 కోట్లుగా ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ రూ.1,971 కోట్లు ఉంటుందని అంచనా. జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తుల విలువ రూ.1,918 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తుల విలువ రూ.2,680 కోట్లు ఉన్నాయని సమాచారం.

సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ రూ.3,508 కోట్లు ఉంటుందని అంచనా. మరో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ దగ్గర రూ.3,980 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దగ్గర రూ.4,100 కోట్లు ఉంటాయని అంచనా. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ దగ్గర ప్రభాస్ నికర ఆస్తుల విలువ రూ.5,400 కోట్లు ఉంటుందని అంచనా.బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే సలార్, కల్కి వరుస హిట్లతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు ప్రభాస్. ఒక్కో సినిమాకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అత్యధిక ధనవంతుడైన హీరోగా ప్రభాస్ నిలిచారు.












Click it and Unblock the Notifications