'కాంతార' టీమ్‌తో రిషబ్ శెట్టికి గొడవలు? రుక్మిణి వసంత్‌కు ఊహించని షాక్!
'కాంతార' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం తన వ్యక్తిగత నిర్ణయాల కారణంగా వార్తల్లో నిలిచాడు. రిషబ్ శెట్టి తన సహనటులను, తనను స్టార్‌గా నిలబెట్టిన నిర్మాణ సంస్థను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు రిషబ్ శెట్టికి, కాంతార టీమ్ కు మధ్య ఏం జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రిషబ్ శెట్టి ఎవరెవరిని అన్‌ఫాలో చేశారు?
పాన్ ఇండియా హీరో రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'కాంతార: చాప్టర్ 1' సహనటులు అయిన రుక్మిణి వసంత్, రాజ్ బి శెట్టిలను అన్‌ఫాలో చేశారు. అంతటితో ఆగకుండా తనకు లైఫ్ ఇచ్చిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హోంబలే ఫిలింస్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్‌ను మాత్రం రిషబ్ శెట్టి ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.

విభేదాలు ఎక్కడ మొదలయ్యాయంటే?
ఒకప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టిలను 'శెట్టి త్రయం' (ముగ్గురు శెట్టిలు) అని పిలిచేవారు. వీరు ఒకరికొకరు ఎంతో మద్దతుగా ఉండేవారు. కానీ 2025లో వచ్చిన '45' అనే సినిమా విషయంలో వీరి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాను రిషబ్ శెట్టి మెచ్చుకుంటూ పోస్ట్ చేసినప్పుడు, అందులో కీలక పాత్ర పోషించిన రాజ్ బి శెట్టి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.ఉపేంద్ర, శివరాజ్ కుమార్లను ఆకాశానికెత్తిన రిషబ్ శెట్టి.. రాజ్ బి శెట్టిని విస్మరించడం అప్పట్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచే వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి.
'జై హనుమాన్' షూటింగ్‌లో రిషబ్ బిజీ
మరోవైపు రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'జై హనుమాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇది 2024 బ్లాక్ బస్టర్ 'హను-మాన్'కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2026లో హంపిలో ప్రారంభమైంది. ఇప్పటికే విడుదలైన రిషబ్ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తన పాత మిత్రులను, నిర్మాణ సంస్థను అన్‌ఫాలో చేయడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై రిషబ్ శెట్టి నుండి ఇంకా ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.












Click it and Unblock the Notifications