హైపర్ ఆది చేసిన పని వల్లే జబర్దస్త్ మానేశా.. రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోన్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్‌ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి పలు సీరియల్స్‌లో నటించింది. 2006లో "అంతరాత్మ" సీరియల్స్‌‌తో రీతూ చౌదరి కెరీర్ ప్రారంభించింది. 'గోరింటాకు' "మిస్టర్ పెళ్ళికొడుకు", "కుటుంబ సభ్యులు" 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి అనేక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. "కేరింత". "రామలీల", "సరైనోడు" వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించింది.

Rithu Chowdary INTERESTING words about Hyper Aadi

ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి.

అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. అయితే జబర్థస్త్‌ షో మానేయడంపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆదిని అని చెప్పి షాకిచ్చింది. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతోనే తాను ఆ షోకు వెళ్లడం లేదని వివరణ ఇచ్చింది. హైపర్ ఆది లేనప్పుడు నేను అక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినట్లు రీతూ చౌదరి చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+