రీతూ చౌదరికి పెళ్లైందా..? బయటపడ్డ అసలు నిజాలు

రీతూ చౌదరి..ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి.

వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది.

Ritu Chaudhary marriage matters came to light

ఇదిలా ఉంటే రీతూ చౌదరి ఇన్నాళ్లు సింగిల్ అని అంతా భావించారు. కానీ ఆమె పెళ్లి చేసుకుందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి శ్రీకాంత్‌ అనే వ్యక్తిని రీతూ చౌదరి పెళ్లి చేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలం క్రితం శ్రీకాంత్‌‌ను తన ప్రియుడని రీతూ చౌదరి అందరికి పరిచియం చేసింది. అతన్నే సైలెంట్ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో రీతూ చౌదరి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నట్టు రీతూ చౌదరి తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+