'ఇంటికో లం***కొడుకు'.. వామ్మో.. బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరైన హిట్ కోసం ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా విజయ్ 'రౌడీ జనార్థన' అనే సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. "బండెడు అన్నం తిని.. కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా..?" అంటూ విజయ్ చెప్తున్న డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే కళింగపట్నంలో ఇంటికో లం**కొడుకు రౌడీ అని చెప్పుకుని తిరుగుతాడు.. కానీ ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన.. అని విజయ్ దేవరకొండ చెప్తున్న డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

అయితే ఈ టైటిల్ గ్లింప్స్ లోని డైలాగ్స్ పై నెట్టింట చర్చ నడుస్తోంది. ఇప్పుడొచ్చే సినిమాల్లో రక్తపాతం, రొమాన్స్ మాత్రమే కాదు బూతులు కూడా కామన్ గా మారిపోయాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్న పిల్లలూ.. మహిళలు మూవీస్ చూస్తారని మర్చిపోయి తల్లులను అవమానించేలా కొన్ని పదాలను వాడేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇటీవల నాని ప్యారడైజ్ చిత్రంలోనూ బూతులు చెప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. బూతుల్లేకుండా కథలు చెప్పలేరా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్థన' మూవీకి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో రాజావారు రాణివారు, అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్వీసీ (SVC) బ్యానర్ పై 59వ సినిమాగా ఇది రూపొందుతోంది. వచ్చే ఏడాది వేసవి టార్గెట్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications