'వార్2'తో జూనియర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డ్!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 విడుదలై మిశ్రమ ఫలితాన్ని మాత్రమే దక్కించుకుంది. యష్ రాజ్ ఫిలింస్ నుంచి వస్తున్న స్పై యాక్షన్ త్రిల్లర్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సిద్ధార్థ్ ఆనంద్ ను తప్పించి అయాన్ ముఖర్జీకి దర్శకత్వ బాధ్యతు అప్పగించడంతో సినిమా ట్రాక్ దెబ్బతింది. సినిమా ఒకరకంగా ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రూ.310 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వసూల్లతో అరుదైన రికార్డును సాధించారు.

ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్
తన కెరీర్ లో మూడుసార్లు రూ.300 కోట్లు అందుకున్న రెండో హీరోగా రికార్డు సృష్టించాడు. గతంలో ఆర్ఆర్ఆర్, దేవర సినిమాల ద్వారా రూ.300 కోట్లు దక్కించుకోగా, ఇప్పుడు వార్ 2తో మరోసారి రూ.300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ప్రభాస్ ఒక్కడే ఆరుసార్లు ఈ రికార్డు స్థాపించారు. భవిష్యత్తులో ఏ హీరో అయినా ఈ రికార్డు బద్దలు కొడతారేమో చూడాలి. వార్2 సినిమా ఎంచుకొని తారక్ తప్పుచేశారంటూ అందరూ విమర్శిస్తున్నారు. తనకున్న ఇమేజ్ ను మర్చిపోయి చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడని, రెండో హీరోగా నటిస్తున్నాడని, అంత అవసరం ఏమొచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Rs 300 crore 3 times NTR s rare record as the second hero

డ్రాగన్ తో రూ.వెయ్యి కోట్లు అందుకుంటాడా?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాద్వారా అయినా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ అందుకుంటారేమో చూడాలి అంటున్నారు. సోలో హీరోగా చేస్తేన తన నటన అద్భుతంగా ఉంటుందని, మూడు దేశాలను గడగడలాడించిన డ్రగ్ స్మగ్లర్ కథతో సినిమా రూపొందుతోంది కాబట్టి కచ్చితంగా డ్రాగన్ బ్లాక్ బస్టర్ అవుతుందనే ఆశలో ఎన్టీఆర్ అభిమానులున్నారు. అయితే దేవర సినిమాను కూడా రెండు భాగాలుగా కాకుండా ఒక భాగంగానే తీసుంటే అద్భుతంగా వచ్చేదని, ఆ సినిమాతోనే రూ.వెయ్యి కోట్ల మార్క్ అందుకునేవాడంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+