శుభవార్త చెప్పిన మెగా కోడలు..? సంబరాలు చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్
RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం..'గేమ్ ఛేంజర్'.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు.సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపించాయి.
ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చేలరేగింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు రూ.100 కోట్లకుపైగానే తేడా కనిపించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో , నిర్మాతలు వెనక్కి తగ్గారు. 'గేమ్ ఛేంజర్' రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తన తర్వాత సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య ఉపాసన క్యామియో రోల్‌లో నటించనుందనే ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఉపాసన సడన్‌గా ప్రత్యక్షం అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఉపాసన ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఉపాసన కామియో రోల్ కనుక చేసినట్లు అయితే 'RC16' హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications