విడాకుల బాట పట్టిన స్టార్ హీరో, హీరోయిన్..? నెల రోజులకే
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
తాజాగా ఓ హీరోయిన్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్‌కు విడాకుల ఇవ్వబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

కరీనా కపూర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన చేతిపై ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు.అయితే ఆ టాటూను తొలగించడంతో సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్‌కు విడాకులు ఇవ్వబోతున్నారనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. కరీనా కపూర్ స్థానంలో ఉన్న త్రిశూలం ఆకారంలో కొత్తగా ఓ టాటూను వేయించుకున్నట్లు కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. అయితే ఈ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. దీంతో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడాకుల వార్త కేవలం పుకార్లే అని తేలిపోయాయి.
తాజాగా మరోసారి వీరి విడాకుల వార్త వైరల్ అవుతుంది.కరీనా కపూర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.."పెళ్లిళ్లు, విడాకులు, టెన్షన్స్, చైల్డ్ బర్త్, ఇష్టపడిన వ్యక్తి చనిపోవడం, పిల్లల పెంపకం... ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. జీవితంలోని సిద్ధాంతాలు, అంచనాలు వాస్తవాలు కాదు. మీ వంతు వచ్చినప్పుడు, మిమ్మల్ని జీవితం మార్చే వరకు, అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. అప్పటిదాకా మనం చాలామంది కంటే తెలివైన వాళ్ళం అని అనుకుంటాము" అంటూ తన సోషల్ మీడియాలో ఓ స్టోరీని షేర్ చేసింది కరీనా కపూర్.
కరీనా కపూర్ నుంచి ఊహించిన పోస్ట్ రావడంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.విడాకులను తీసుకోబోతున్నామని కరీనా ముందే హింట్ ఇచ్చిందని వారు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే గత నెలలో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న సైఫ్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో సైఫ్‌కి ఆరుసార్లు కత్తిపోట్లు తగలగా, ఆపరేషన్ అనంతరం మూడు రోజులు తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.సైఫ్‌పై దాడి జరిగి నెల రోజులు కాకుండానే ఇలా విడాకుల వార్త రావడం సంచలనంగా మారింది. మరి దీనిపై ఈ సెలబ్రిటీ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications