ఆ దర్శకుడితో శృతి హాసన్ రిలేషన్..? రొమాన్స్ వీడియో వైరల్
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. మైఖేల్‌తో విడిపోయిన తర్వాత మద్యానికి బానిస అయ్యానని, ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని శ్రుతి హాసనే స్వయంగా చెప్పుకొచ్చింది.

చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్..తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడం శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చింది.
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన సలార్-2తో పాటు, రజనీకాంత్ హీరోగా నటిస్తూన్న కూలీ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. కూలీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే 1 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.ఈక్రమంలో శృతి హాసన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
రజినీకాంత్‌తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆయన అంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో.. ఆయనతో కలిసి వర్క్ చేయడం వల్ల అర్థం అయింది.వ్యక్తిగతంగా కూడా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. రజినీకాంత్ సెట్‌లో ఉంటే అందరిలో ఓ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ఇదే సమయంలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరని ప్రశ్నించగా, ఆమె లోకేష్ కనగరాజ్ పేరు చెప్పారు.ఆయనతో వర్క్ చేయడంతో నా కల నెరవేరిందని శృతి హాసన్ తెలిపింది.శృతి హాసన్ లోకేష్ కనగరాజ్ పేరు చెప్పడంతో వీరు ప్రేమలో ఉన్నారనే గుస గుసలు వినిపిస్తున్నాయి.గతంలో వీరిద్దరు కలిసి ఓ యాడ్‌లో నటించారు.
సంతోషంగా ఉంది. ఆయన అంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో.. ఆయనతో కలిసి వర్క్ చేయడం వల్ల అర్థం అయింది. ఆయనలో ఉండే అంకితభావం, పాత్ర కోసం కష్టపడే తత్వం ఈరోజు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రజినీకాంత్ సెట్‌లో ఉంటే అందరిలో ఓ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. ఇక ఇష్టమైన డైరెక్టర్ ఎవరూ అని అడగ్గా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు చెబుతూ 'ఆయనతో వర్క్ చేయడంతో నా కల నెరవేరింది' అని తెలిపింది.
కాగా.. లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ ఇద్దరూ కలిసి గతంలో ఓ యాడ్ కూడా షూట్ చెయ్యగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ కూడా నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు తనకు ఇష్టమైన డైరెక్టర్స్‌లో లోకేష్ పేరు చెప్పడంతో మరోసారి వీరి ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి.లోకేష్‌తో శ్రుతిహాసన్ ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది. ఈ 18 సెకన్స్ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. ఈ సాంగ్ ప్రోమోలో శ్రుతిహాసన్ తన అందాలతో రెచ్చిపోయింది. అటు లోకేష్ సైతం శ్రుతిహాసన్‌కు ధీటుగా నటించాడు.ఇప్పుడు శ్రుతిహాసన్ లోకేష్ పేరు వెల్లడించండంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
-
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications