విజయ్‌ దేవరకొండతో రష్మిక బ్రేకప్..? ఆ పోస్ట్‌తో షాకిచ్చిందిగా..

గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు.

అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్‌కు రావడం జరిగింది.

rumors goes viral on vijay Deverakonda and Rashmika Mandanna

అసిస్టెంట్ పెళ్లికి హజరైన తర రష్మిక,విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో రష్మిక తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరు ఒక్కసారి షాక్‌కు గురైయ్యారు.విజయ్ ఇంట్లోనే రష్మిక ఉందని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేశారు.మరోసారి ఈ జంట ఒకే చోట దర్శనం ఇచ్చారు. రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే రష్మిక,విజయ్ దేవరకొండల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. రష్మిక ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో నేను దయను దానితో వచ్చే ప్రతిదాన్ని ఎంచుకుంటాను.మనమందరం ఒకరికొకరు తోడుగా ఉందాం అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక కాలుకు ఇటీవల గాయం అయింది. ఇటువంటి సమయంలో విజయ్ దేవరకొండ ఆమె పక్కన లేకపోవడంతోనే రష్మిక ఇలాంటి పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రష్మిక,విజయ్ దేవరకొండ బ్రేకప్ చెప్పుకున్నారని,అందుకే ఆమె ఇలాంటి పోస్ట్ షేర్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో అలాంటిది ఏమీ లేదని, ఆమె కేవలం ఓ కొటేషన్ మాత్రమే పోస్ట్ చేసిందని, ఇందులో భూతద్దం వేసుకొని వేతకాల్సిన పనిలేదంటూ రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+