క్రికెటర్‌తో ఆ హీరో భార్య రిలేషన్..? గ్రౌండ్‌లోనే రచ్చ
రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు.కొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుని విడిపోగా, మరికొందరు వివాహం చేసుకుని తమ జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సీనియర్ క్రికెటర్‌తో దర్శనం ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు..బాలీవుడ్ స్టార్ బ్యూటీ మలైకా అరోరా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. 51 ఏళ్ల వయస్సులో కూడా హాట్‌గా ఎలా కనిపించాలో మలైకా అరోరాను చూసే నేర్చుకోవాలి. అందాల ఆరబోతకు మలైకా అరోరా పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అతనితో ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది.

తనకంటే తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు, వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జున్ కపూర్ ద్వారా మలైకా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే మిగిలిందనుకున్నారు. అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జంట విడిపోయారు.
గత కొంతకాలంగా వీరద్దరు కలిసి కనిపించడం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా .. ఏ ఫంక్షన్ అయినా.. కలిసి దర్శనం ఇచ్చే ఈ జంట.. ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారు.ఇటీవల సింగిల్‌గానే మలైకా అరోరా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఆమె పక్కన అర్జున్ కపూర్ కనిపించడం మానేశారు. అంబానీ ఇంట పెళ్లిలో కూడా అర్జున్ కపూర్ సింగిల్‌గానే కనిపించాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ భామ క్రికెటర్‌తో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.కుమార సంగక్కర ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
Malaika Arora with Kumar Sangakkara. pic.twitter.com/6ZGwGXqOFu
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2025
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం గౌహతి వేదికగా మ్యాచ్ జరిగింది. కుమార సంగక్కరతో కలిసి మలైకా అరోరా ఈ మ్యాచ్‌ను తిలకించారు. ఇద్దరు కూడా రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించి పక్క పక్కనే కూర్చున్నారు. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి ఫొటోలు వైరల్ కావడంతో ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం వీరి ఫొటోలు , వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications