బికినీలో సాయి పల్లవి.. మరీ ఇంత బోల్డా..?
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా 'ఫిదా' నుంచి మొన్న వచ్చిన 'తండేల్' వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 'గార్గి' సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. 'అమరన్'సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె కెరీర్‌లో ఎన్నో మరపురాని సినిమాలు చాలానే ఉన్నాయి.
Sai pallavi in swimsuit #saipallavi #SaiPallaviHot #saipallavihotface #saipallavibikini pic.twitter.com/HyUuyW9D6Y
— South Indian Actress (@ActressSouth) September 21, 2025
ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలను చూస్తే సాయి పల్లవి ఓ ట్రిప్‌కు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది. తన చెల్లి, ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అయితే గ్లామర్‌కు దూరంగా ఉంటే సాయి పల్లవి బికినీతో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఎప్పుడు పద్దతిగా కనిపించే సాయి పల్లవి, ఇలా బికినీతో కనిపించే సరికి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. అయితే నిజంగానే సాయి పల్లవి ఫొటోలా లేక ఏఐ ద్వారా జనరేట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి బిినీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications