ఐటం సాంగ్‌లో సాయి పల్లవి

హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో లవ్ స్టోరి , రానాతో విరాట పర్వం సినిమాల తరువాత సాయి పల్లవి మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు.తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.మళయాళ సినిమా ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచియమైన సాయి పల్లవి , శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

చేసింది తక్కువ సినిమాలే అయిన సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి తన స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

sai pallavi mass dance in item song

తాజాగా సాయి పల్లవికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి పల్లవి కాలేజ్ చదువుకునే రోజుల్లో డ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన డ్యాన్స్‌తో యూత్‌ను ఉర్రుతలుగించిన 'షీలా కీ జవానీ సాంగ్'కు సాయిపల్లవి ఊర మాస్ డాన్స్ చేసింది. సాయి పల్లవి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఎలాంటి కఠినమైన స్టెప్ అయినా అలవోకగా చేసే సాయిపల్లవి టాలెంట్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తోన్న తాండెల్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' ప్రాజెక్ట్‌లో సీత పాత్రలో సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది సాయి పల్లవి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+