Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ జవాన్ బయోపిక్ లో సల్మాన్ ఖాన్..!

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఓ హిట్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆయన సరైన హిట్ పడి చాలా ఏళ్లే అయింది. ఇటీవల మురుగదాస్ డైరెక్షన్ లో సికందర్ మూవీ చేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో ఆయన కథలపై దృష్టి పెట్టారు. నిజ జీవితంలో జరిగిన కథలైతే ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారట. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన సైనికుడి జీవిత కథలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు.. 2020లో చైనా ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత్- చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన వివాదంలో ఆయన వీరమరణం పొందారు. అయితే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3 నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడుతుంది. అయితే ఇందులో టైటిల్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందట. మొదట ముంబై ఆ తర్వాత లద్దాఖ్ లో 70 రోజులపాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు.. 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3 అనే నవల కూడా రాశారు.

Salman Khan Signs Biopic on Galwan Braveheart Col Santosh Babu

సల్మాన్ ఖాన్ గతంలో హీరోస్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి సినిమాల్లో నటించారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి దేశభక్తి చిత్రంలో నటించి మెప్పించాలని సల్మాన్ ఖాన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+