సమంత ప్రెగ్నెన్సీ పోస్టు వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తక్కువ సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో ఏమాయ చేసావే చిత్రంతో అందరినీ మాయ చేసిన సామ్.. ఆ తర్వాత వరుసగా బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్లిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగునాట స్టార్ హీరోయిన్ గా మారారు.
హీరోయిన్ గా విజయవంతంగా ఉన్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్యతో ఆమె వివాహం అయింది. 2017 అక్టోబర్ 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. అయితే 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అలాగే సమంత సైతం నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
ఆ తర్వాత సినిమాలు కూడా తగ్గించారు సమంత. యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చిన సమంత.. రెండేళ్లుగా అస్సలు తెలుగు ఇండస్ట్రీ వైపు చూడట్లేదు. అలాగే ఏ ఇండస్ట్రీలోనూ నటించట్లేదు. ఈ క్రమంలోనే తెలుగులో శుభం సినిమాతో నిర్మాతగా మారారు. ఇక బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో దుబాయ్ ట్రిప్‌లో ఉన్నారు సామ్. ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసారు సమంత. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా సమంత.. తన ఇన్ స్టా వేదికగా ప్రెగ్నెన్సీ పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్రియేటిన్ అనే పౌడర్ తీసుకోవడం వల్ల మహిళలు బలంగా తయారు అవుతారని, వారికి ప్రెగ్నెన్సీ సమయంలో, మెనోపాజ్ సమయంలోనూ ఈ పౌడర్ తక్షణ శక్తిగా ఉపయోగపడుతుందని ఉన్న పోస్టును ఆమె తన ఖాతాలో పోస్టు చేశారు.

ఈ పౌడర్ వల్ల మహిళలు గర్భం దాల్చే సమయంలో శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటారని ఈ పోస్టులో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమంత పోస్టు చేసింది. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications