సమంత పెళ్లికి లైన్ క్లియర్.. ఆ నెలలోనే ముహూర్తం..?
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ తొలి రోజుల్లో మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ 2010లో విడుదలైన ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందర్నీ మాయ చేసింది. అలా నటించిన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్టీఆర్ బృందావనం, మహేశ్ బాబు దూకుడు చిత్రాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఆ తర్వాత ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అగ్రశ్రేణి హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోయింది.
అయితే 2010లో రిలీజైన ఏమాయ చేశావే చిత్రంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరి వివాహం 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో జరిగింది. హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీళ్లిద్దరూ అక్టోబరు 2, 2021లో విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
సామ్ తో విడాకుల అనంతరం అక్కినేని నాగ చైతన్య ఇటీవల హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని సోషల్ మీడియాలో సామ్ ఫ్యాన్స్ రోజూ వందల పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తున్న విషయం ఖరారు అవడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
ఇటీవలే ఆమె తిరుమలకు రాజ్ నిడుమోరుతో కలిసి వచ్చిన నేపథ్యంలో ఇక ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మరో సంచలన వార్త బయటకు వస్తోంది. ఆమె మరో రెండు నెలల్లో రాజ్ నిడుమోరుతో ఆమె పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మ్యారేజ్ ఈపాటికే జరగాల్సి ఉండగా.. నాగచైతన్యతో విడాకుల అంశం కోర్టులో ఉండటంతో ఆగినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో ఆ వ్యవహారం కొలిక్కి వస్తుందని ఆ తర్వాత ఘనంగా వీరి మ్యారేజ్ జరగనుందని సమాచారం.

సమంత నాగచైత్య విడాకుల వ్యవహారం తుది తీర్పు వచ్చే వరకు వీళ్లిద్దరు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేరట. దీంతో మరో రెండు నెలలు ఎదురు చూడాల్సిందేనని సమాచారం. మరోవైపు సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో రాజ్ నిడుమోరు ఆమెపై చూపించిన శ్రద్ద, ప్రేమపై సమంత మనసు కరిగిపోయిందట. దీంతో ఆమెనే ముందుగా రాజ్ కు ప్రపోజ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా మా సమంతకు ఓ తోడు దొరికిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభమ్' అనే చిత్రం మే 9న విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications