గుడ్ న్యూస్ చెప్పిన సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా సమంత పరిచియం అయింది. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తరువాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్నారు.

విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. అయితే ఆరోగ్యం నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు.
తాజాగా ఆమె మరో సినిమాను ఎనౌన్స్ చేశారు. ''కలలు కనడం ఎప్పుడూ ఆపవద్దు. కొంత కాలం తర్వాత మళ్లీ సినిమా సెట్స్‌పైకి రావడం ఆనందంగా ఉంది'' అనే క్యాప్షన్ జత చేసి కాఫీ కప్ ఓ బుక్ ఉన్న పిక్ షేర్ చేసింది. అయితే ఆమె తన కొత్త సినిమా విషయాలను ఏమీ బయటపెట్టలేదు. దీంతో సమంత ఎవరి సినిమాలో నటిస్తుందా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. మొత్తానికి సమంత తిరిగి సినిమాల్లో నటించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications