మరోసారి ప్రేమలో పడ్డ సమంత..ఏకంగా అతనికి I love you చెబుతూ పోస్ట్

హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలను కూడా ఆపేసింది. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.

రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. అయితే సమంత ప్రియుడు గురించి గతంలో అనేక వార్తలు ప్రచారం అయిన సంగతి అందరికి తెలిసిందే. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్‌లో ఉందని..వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు.

Samantha birthday greetings to preetham jukalker

తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన తరువాత వీరిద్దరు మళ్లీ కలిసి కనిపించింది లేదు. అయితే మరోసారి ప్రీతం జుకాల్కర్‌తో కలిసి సమంత కనిపించి అందరికి షాకిచ్చింది. సమంత ఇటీవల పద్మావతి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుంది. ఆ తర్వాత సమంత తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది. ఈ సమయంలో సమంతతో పాటు అక్కడ ప్రీతం జుకాల్కర్ కూడా దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.దీంతో మరోసారి ఇండస్ట్రీలో వాళ్ళ మధ్య ఏదో ఉందంటూ వార్తలు మొదలయ్యాయి.

పైకి స్నేహం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీతం జుకాల్కర్ పుట్టిన రోజు సందర్భంగా సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.హ్యాపీ బర్త్డే బేబీ బాయ్, నీతో పాటు నువ్వు ఉన్న ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్స్ యూ , ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది.దీంతో మరోసారి ప్రీతం జుకాల్కర్, సమంతల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రీతం జుకాల్కర్‌తో సమంత మరోసారి ప్రేమలో పడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+