రాజ్ నిడుమోరుతో సమంత నిశ్చితార్థం?.. వైరలవుతున్న డైమండ్ రింగ్!
స్టార్ హీరోయిన్ సమంత దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా రెండు సంవత్సరాల నుంచి చెలామణి అవుతోంది. ఈ రెండు సంవత్సరాల్లో ఆమె ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ మొదటి ర్యాంకింగ్ ను సంపాదించుకోవడం విశేషం. కేవలం ఖుషి సినిమా తెలుగులో చేసింది. అంతకుముందు ఫ్యామిలీమ్యాన్, ఇటీవల హనీబన్నీ సిరీస్ లు చేసింది. త్వరలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేయనుంది. ఈ సిరీస్ లన్నింటికీ తెలుగువారే డైరెక్టర్లు. రాజ్ అండ్ డీకేగా పిలిచే ఈ ఇద్దరిలో రాజ్ నిడుమోరు ఒకరు. అతనితో సమంత డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి
హైదరాబాద్ రావడం మానేసింది
ఫ్యామిలీమ్యాన్, హనీబన్నీ సిరీస్ చేసే సమయలో రాజ్ నిడుమోరుతో సమంతకు ఎక్కువ పరిచయం ఏర్పడి.. అది ఇప్పుడు ప్రేమగా మారిందంటూ ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత ముంబయికి మకాం మార్చిన సమంత హైదరాబాద్ లో నివాసం ఉండటంలేదు. ఎప్పుడన్నా ఒకసారి అతిథిలా వచ్చివెళుతోంది. ముంబయిలో రాజ్ నిడుమోరుతో సమంత తరుచుగా కనిపిస్తోందని, వారిద్దరూ కలిసి ఇటీవలే ఓ పార్టీకి హాజరయ్యారు. తర్వాత పికిల్ బాల్ స్ప్టోర్ట్స్ వేడుక జరిగితే ఆ వేడుకకు కూడా రాజ్ నిడుమోరు, సమంత హాజరయ్యారు. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఉండటం అందరినీ ఆకర్షించింది.

నిశ్చితార్థం జరిగిందంటున్న నెటిజన్లు
రాజ్ నిడుమోరు, సమంత వార్తలను నిజం చేస్తూ ప్రత్యేకంగా ఓ పెద్ద రూమర్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. సమంత చేతి వేలికి ఓ వజ్రపు ఉంగరం ఉంది. ప్రస్తుతం ఆ ఉంగరంతో ఉన్న సమంత ఫొటో వైరలవుతోంది. దీన్నిబట్టి రాజ్ నిడుమోరుతో సమంతకు నిశ్చితార్థం జరిగివుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తాజాగా ఓ పార్టీలోను వీరిద్దరూ కలిసి కనిపించారు. నెలరోజుల సమయంలో మూడుపార్టీలకు ఈ జంట హాజరుకావడంతో కచ్చితంగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ వస్తున్న వార్తలు కూడా ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు.












Click it and Unblock the Notifications