వారిద్దరి వల్లే నీ జీవితం ఇలా అయింది - సమంత
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత , కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దర్శకులు రాజ్ & డీకేలపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో తనని తాను నిరూపించుకోవడానికి దర్శకులు రాజ్ & డీకేల పాత్ర ఎంతో ఉందని సమంత తెలిపారు.
ఫ్యామిలీమ్యాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ లాంటి ప్రాజెక్ట్‌లలో పని చేయడం వల్ల నటిగా తనను తాను నిరూపించుకో గలిగానని ఆమె తెలిపారు. ఇదే తనను తాను సవాలు చేసుకునే పాత్రల్లో నటించేలా చేసిందని, రాజ్ & డీకే కారణంగా ప్రతి విషయాన్ని లోతుగా చూడటం నేర్చుకున్నానని చెప్పింది సమంత. వాళ్లిద్దరే తనను ఛాలెంజ్ పాత్రల్లోనే నటించేలా అలవాటు చేశారని, అలా వాళ్లిద్దరూ నన్ను చెడగొట్టారని సరాదాగా కామెంట్ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications