నాగచైతన్య హీరోయిన్ పై సమంత కామెంట్స్
తెలుగులో స్టార్ కథానాయికగా కొనసాగుతోంది సమంత. నాగచైతన్యతో ప్రేమలో పడటం, తర్వాత పెళ్లిచేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. అనంతరం మయోసైటిస్ కు గురైంది. చికిత్స కోసం ఒక సంవత్సరం సమయం సినిమాలకు దూరంగా ఉండి ప్రస్తుతం కథలను వింటోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు నిరంతరం వ్యాయామాలు చేస్తుంటుంది. తాజాగా తన బరువుకు సంబంధించి చేసిన పోస్ట్ కూడా వైరలైంది.
తాజాగా ఈ బ్యూటీ నేచురల్ బ్యూటీ అయిన సాయిపల్లవిపై పొగడ్తల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాకపోతే ఇది పాత వీడియో. దీన్ని సమంత అభిమానులు ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఈటీవీలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కు వేదికగా ఢీ షో ఉంటుందన్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి హీరోయిన్ కాకముందు ఈ డ్యాన్స్ షోలో పాల్గొనేది.

ఈ క్రమంలోనే ఒక ఎపిసోడ్ కు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గెస్ట్ గా వచ్చింది. సాయిపల్లవి డ్యాన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని, తన నృత్యం మెస్మరైజ్ చేసిందని కామెంట్ చేసింది. సాయిపల్లవి డ్యాన్స్ చేస్తున్నంతసేపు తాను కళ్లు తిప్పుకోలేకపోయానని, తనలా అందరూ డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుందని సమంత వ్యాఖ్యానించింది. అంతేకాదు.. అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిందని కొనియాడింది. హీరోయిన్ పరంగా, నృత్యం పరంగా సమంతకు పోటీనిచ్చే స్థాయిలో సాయి పల్లవి ఉందని, అయినా అటువంటి విషయాలను పట్టించుకోకుండా సాయిపల్లవి గురించి ఇలా పాజిటివ్ గా కామెంట్లు చేయడం సమంతకే సాధ్యమంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి నాగచైతన్య తండేల్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.












Click it and Unblock the Notifications