బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సమంత
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు.ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ''హనీ, బన్నీ'' పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత తాజాగా చేసిన స్టేట్మెంట్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తన సకీ కంపెనీకి వర్క్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ కావాలని ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా మెయిల్ ఐడిని కూడా ఇచ్చింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ ఆమె దగ్గర పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు హెల్త్‌కు సంబంధించిన విషయాలు తెలిపిన సమంత సడెన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయడంతో నెట్టింట పలు అనుమానాలకు తెరలేపింది. సమంత సినిమాలు ఆపేసి బిజినెస్ చేస్తుందా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications