రాజ్ నిడుమోరుతో కొత్త జర్నీ మొదలు .. సమంత సంచలన పోస్ట్‌

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో ప్రముఖ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడుమోరుల గురించి ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. వారు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

సమంత, రాజ్ నిడుమోరు కలిసి 'ఫ్యామిలీ మ్యాన్', 'సిటాడెల్' వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లకు పనిచేశారు. 'ఫ్యామిలీ మ్యాన్' సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Samantha-Raj Nidimoru Relationship New Fire with Maa Inti Bangaram Production

అయితే, రాజ్ నిడుమోరుకు ఇప్పటికే వివాహం కావడంతో, ఆయన త్వరలో తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన భార్య సోషల్ మీడియాలో రాజ్ నిడుమోరు గురించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో, వారు విడిపోయారనే వార్తలకు బలం చేకూరింది.

ఈ జంట తరచుగా కలిసి కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమా పనులను రాజ్ నిడుమోరు దగ్గరుండి చూసుకోవడమే కాక, కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లినప్పుడు కూడా ఆయన ఆమెతో పాటు ఉన్నారు.

సమంత తన సోషల్ మీడియాలో రాజ్ నిడుమోరు భుజంపై వాలిన ఒక ఫోటోను గతంలో షేర్ చేసింది.ముంబైలో ఒకే కారులో ప్రయాణిస్తూ, జిమ్ నుంచి బయటకు వస్తూ కెమెరా కంటికి చిక్కారు.

వీటన్నింటికీ మించి, సమంత ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు రాజ్ నిడుమోరు హాజరవ్వడం ఈ ప్రచారానికి దాదాపుగా ధృవీకరణగా మారింది. సమంత కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్న ఈ వేడుకల్లో ఆయన కనిపించడంతో, నెటిజన్లు వారి డేటింగ్‌ను పక్కా అని నిర్ధారించుకుంటున్నారు.

తాజాగా మరోసారి ఈ జంట కలిసి దర్శనం ఇచ్చారు. సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. దీనిపై సమంత రియాక్ట్ అవుతూ..'ప్రేమ ఆశీర్వాదాలతో 'మా ఇంటి బంగారం' చిత్రంతో మంచి ముహూర్తంతో మా జర్నీ ప్రారంభించాము. మేము ఏమి సృష్టిస్తున్నామో మీతో పంచుకోవడానికి మేము వేచి ఉండలేము. ఈ ప్రత్యేక చిత్రాన్ని ప్రారంభించేటప్పుడు మీ అందరి ప్రేమ, మద్దతు మాకు అవసరం'' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.ఈ చిత్రానికి స‌మంత‌తో పాటు రాజ్ నిడుమోరు కూడా నిర్మాత వ్యవహరిస్తున్నారు. దీంతో మరోసారి సమంత ,రాజ్ నిడుమోరుల బంధంపై చర్చ జరుగుతోంది.

సమంత-రాజ్ నిడుమోరుల రిలేషన్‌షిప్‌ను దాదాపు కన్ఫామ్ చేసుకున్న నెటిజన్లు, ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ, "పెళ్లి ఎప్పుడు?" అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ వార్తలపై సమంత కానీ, రాజ్ నిడుమోరు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+