సమంత బండారం బయటపెట్టిన డాక్టర్..!
సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం ఆపేసింది. ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్రల్ ఇస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.

సోషల్ మీడియాలో సమంతకు ఎనలేని అభిమానులు ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 33 మిలియన్ల అభిమానులు సమంతను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా సమంత ఓ సమస్యలో చిక్కుకుంది. సమంత ఇటీవల మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది.తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు.. తన డాక్టర్‌తో చర్చకు వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని సమంత అభిప్రాయపడింది. కానీ ఇలా మెసేజ్ చేయడంతో చీప్ అయిపోయాడని ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది.
తన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కానీ చెడు ఆలోచన లేదని సమంత చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఓ డాక్టర్ సమంత ఇచ్చిన టిప్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని సమంత చెప్పడం సరికాదని అతను తెలిపాడు. అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని డాక్టర్ తన పోస్ట్ ద్వారా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంత తన 33 మిలియన్ల ఫాలోవర్లకు తప్పుదోవ పట్టిస్తుందని సమాచారం తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.












Click it and Unblock the Notifications