నేను సంతోషంగా ఉన్నా.. కారణం ఎవరో తెలుసా?: సమంత
అగ్ర కథానాయిక సమంత పేరు చెప్పగానే అందరికీ మయోసైటిస్, నాగచైతన్యతో విడాకులు వంటి అంశాలే గుర్తుకు వస్తాయి. సామ్ కు ఎంత కష్టం వచ్చింది? ఇలా అయిందేంటి? చలాకీగా ఉండే పిల్లకు ఇలాంటి కష్టం రావడమేంటని అభిమానులు బాధపడుతుంటారు. అయితే ప్రస్తుతం సమంత చాలా సంతోషంగా ఉందంట. అంత హ్యాపీగా ఉండటానికి కారణం కూడా చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ తో బాధపడింది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎంతో కష్టపడింది. దేశాలన్నీ తిరిగింది. వీటికోసం ఏడాది కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ అమ్మడు కోలుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ బ్యూటీ సినిమాల్లోకి రాబోతోందంటూ చర్చించుకుంటున్నారు. త్వరలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టబోతున్న సమంత తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఒక పోస్ట్ చేసింది.

తనకు బాల్యంలో అకడమిక్ సబ్జెక్టులకంటే ఎక్కువగా ఇతర పుస్తకాలను చదివేదాన్నని, వీటిని చదవడంద్వారా ఎంత సమయం అయిందో కూడా మర్చిపోయేదానన్ని చెప్పింది. ఏ సబ్జెక్టులో అయినా పరిశోధన చేయడంతోపాటు వాటిలో లీనం అవడం అనేది తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. తిరిగి ఇదే అలవాటును చేసుకున్నానని, తాను మళ్లీ పుస్తకాలు చదువుతున్నానని చెప్పుకొచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన మనసు ఉప్పొంగుతోందని, తన పుస్తకాల ర్యాక్ లో పుస్తకాలన్నీ నిండిపోతున్నాయంది. త్వరలోనే మీతో ఆ గుడ్ న్యూస్ పంచుకుంటానని సమంత చెప్పింది. మరో వారం రోజుల్లో తన హెల్త్ పాడ్ ను అభిమానులకు తెలియజేయబోతోంది. అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు తనవంతుగా సహాయం చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications